క్రిష్ సారథ్యంలో 'కన్యాశుల్కం' వెబ్ సిరీస్ .. 'మధురవాణి'గా అంజలి!

  • క్రిష్ సారథ్యంలో రూపొందిన 'కన్యాశుల్కం'
  • ఇది 6 ఎపిసోడ్స్ తో కూడిన వెబ్ సిరీస్ 
  • త్వరలో జీ 5లో స్ట్రీమింగ్
  • గిరీశం పాత్రను పోషించిన అవసరాల 

'కన్యాశుల్కం' .. గురజాడవారి అద్భుత సృష్టి. ఈ నాటకం ద్వారా ఆనాటి సామాజిక పరిస్థితులను .. మూఢాచారాలను ఆయన ఎండగట్టడం జరిగింది. అయితే తాను చెప్పదలచుకున్న అంశానికి ఆయన హాస్యాన్ని జోడించడం విశేషం. అందువల్లనే ఆ నాటకం అంత పాప్యులర్ అయింది. అప్పట్లో ఈ నాటకం వేయని ఊరు ఉండేది కాదు. 

'కన్యాశుల్కం' నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్ కి నాటకాలపై ... నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్ గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 

గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. మధురవాణిగా అంజలి .. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. 6 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి మరి.


More Telugu News