అయోధ్య రామమందిరం ఆహ్వానపత్రిక ఇదే.. వెలుగులోకి వచ్చిన కార్డును మీరూ చూడండి!

  • ఈ నెల 22న ఆయోధ్య రామాలయ ప్రారంభం
  • ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది అతిథులకు ఆహ్వానాలు
  • కార్డు అద్భుతంగా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు
  • ఆహ్వానపత్రిక చూసి తన్మయత్వం 
ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రిక వెలుగులోకి వచ్చింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన ఎక్స్ ఖాతాలో ఈ ఇన్విటేషన్ కార్డు వీడియోను షేర్ చేసింది. ‘శ్రీరాముడు తన స్వస్థలంలోని మహా ఆలయానికి తిరిగి వచ్చిన సందర్భంగా శుభప్రదమైన వేడుక’ అని కార్డు మొదటి పేజీలో ముద్రించారు. అలాగే, ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎప్పుడేం జరిగిందన్న వివరాలను కూడా పొందుపరిచారు. సోషల్ మీడియాకెక్కిన ఈ కార్డు వైరల్ అవుతోంది. కార్డు అద్భుతంగా ఉందని  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు తన్మయత్వంతో ‘జై శ్రీరాం’ అంటూ కామెంట్లు చేశారు. 

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మొత్తం 6 వేల మంది అతిథులను ఆహ్వానిస్తూ శ్రీరాం తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్డులు పంపించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.


More Telugu News