మెట్రో రైలు కొత్త ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని ఆదేశం
  • రాయదుర్గం - విమానాశ్రయం మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని సూచన
  • ఎల్బీ నగర్-హయత్ నగర్, మియాపూర్-పటాన్ చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్-ఎయిర్ పోర్ట్ మార్గాలకు ఓకే
మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెట్రో రైలు కొత్త మార్గాలకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాయదుర్గం - విమానాశ్రయం మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు... కొత్త ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వీటిలో ఎల్బీ నగర్ - హయత్ నగర్, మియాపూర్ - పటాన్ చెరు, రాయదుర్గం - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్ - ఎయిర్ పోర్ట్ మార్గాలలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు అంశంపై అక్కడి ప్రజాప్రతినిధులతో చర్చించాలని అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.


More Telugu News