హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్! రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

  • రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడి
  • కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా సంతోష్‌నగర్ వద్ద పైప్ లైన్ జంక్షన్ పనులు 
  • ఈ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్! రేపు అనగా బుధవారం 3వ తేదీన కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ప్రకటించింది. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా సంతోష్‌నగర్ వద్ద పైప్ లైన్ జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపింది.

ఈ పైప్ లైన్ పనుల వల్ల పాతబస్తీలోని మీర్ఆలం, కిషన్‌బాగ్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, మాదన్నపేట్, రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో జనవరి 3న తాగునీరు నిలిపివేయబడుతుందని పేర్కొంది. కొన్ని సమీప ప్రాంతాల్లోనూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చునని పేర్కొంది.


More Telugu News