మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై షర్మిల స్పందన
- వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- షర్మిలతోనే తన రాజకీయ ప్రస్థానం అని ప్రకటన
- ఆర్కే వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపిన షర్మిల
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నమోదు కాబోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు లాంఛనమే! ఆమె తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు!
కాగా, ఇటీవల వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... తన రాజకీయ ప్రస్థానం వైఎస్ షర్మిలతోనే అని ఇటీవల ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే, తాను కూడా ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళతానని వివరించారు.
ఆర్కే వ్యాఖ్యలపై మీడియా షర్మిలను ప్రశ్నించింది. అందుకామె స్పందిస్తూ... తన పట్ల, వైఎస్సార్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా, తన రాజకీయ భవిష్యత్తుపై రెండ్రోజుల్లో స్పష్టతనిస్తానని షర్మిల తెలిపారు. ఇవాళ ఆమె వైఎస్సార్టీపీ ముఖ్యనేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది.