బీఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాల్సిందే: కిషన్ రెడ్డి
- సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న కిషన్ రెడ్డి
- కేసీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అపర భగీరథుడిగా కీర్తించిందని విమర్శ
- ప్రాజెక్టుల్లో జరిగిన తప్పులు బయటకు రావాల్సిందేనని వ్యాఖ్య
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అపర భగీరథుడిగా కీర్తించిందని విమర్శించారు. అన్ని ప్రాజెక్టులకు కేసీఆరే చీఫ్ ఇంజినీర్ అని ప్రచారం చేశారని అన్నారు. మరి ఆయన నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో జరిగిన తప్పులు బయటకు రావాల్సిందేనని చెప్పారు.