మెట్రోట్రాక్‌పై పడిపోయిన సెల్‌ఫోన్.. తీసుకునేందుకు ట్రాక్ మధ్యలోకి దూకిన మహిళ.. సెక్యూరిటీ సిబ్బంది స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం

  • బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో ఘటన
  • క్షణాల్లో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది
  • విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సెక్యూరిటీ సిబ్బంది
  • 15 నిమిషాలు ఆలస్యంగా రైళ్లు
మెట్రో రైలు ట్రాక్‌పై సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసుకునేందుకు మహిళ 750 కేవీ విద్యుత్ ప్రవహించే ట్రాక్ మధ్యలోకి దూకేసింది. బెంగళూరులో జరిగిందీ షాకింగ్ ఘటన. ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో ఉదయం 6.45 గంటలకు ఈ ఘటన జరిగింది. మహిళ ట్రాక్ మధ్యలోకి దూకడాన్ని గుర్తించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూముకు సమాచారం అందించడంతోపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. 

ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ట్రాక్‌పై పడిపోయిన ఫోన్‌ను తీసుకున్న మహిళ మరో ప్రయాణికురాలి సాయంతో తిరిగి ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి.


More Telugu News