ఇండియా - పాక్ మ్యాచ్ లకు క్రేజ్ లేదు.. అసలైన పోటీ ఈ దేశాల మధ్యే: గౌతమ్ గంభీర్

  • ఇప్పుడు ఇండియా -ఆస్ట్రేలియాల మధ్య ఎక్కువ పోటీ ఉందన్న గంభీర్
  • పాకిస్థాన్ కంటే ఇండియా ఎంతో సుపీరియర్ గా ఉందన్న మాజీ క్రికెటర్
  • ఏ క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెపుతాడని వ్యాఖ్య
ఇండియా - పాకిస్థాన్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఆ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే, ప్రపంచ క్రికెట్ లో అసలైన యుద్ధం ఇండియా - పాకిస్థాన్ ల మధ్య కాదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పారు. గత కొంత కాలంగా ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్ లకు క్రేజ్ పెరుగుతోందని తెలిపారు. క్రికెట్ కోణంలో చూస్తే ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్యే అత్యధిక పోటీ ఉందని చెప్పారు. ఏ క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెపుతారని అన్నారు. 

క్రికెట్ చరిత్రలో ఎన్నో సార్లు ఇండియాను పాకిస్థాన్ డామినేట్ చేసిందని... కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే మూడు ఫార్మాట్లలో కూడా పాక్ కంటే టీమిండియా ఎంతో సుపీరియర్ గా ఉందని గంభీర్ చెప్పారు. గతంలో మాదిరి ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠను పెంచేంత సమతుల్యత లేదని అన్నారు. ఇండియా గెలిస్తే ఊహించిందే జరిగిందని అనుకుంటామని... పాక్ గెలిస్తే నిరాశకు గురవుతామని... అంతకు మించి ఏమీ ఉండదని చెప్పారు. 


More Telugu News