దేశంలో పెరుగుతున్న కరోనా జేఎన్-1 కేసులు... కేరళలో అత్యధికం

  • ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటున్న కొవిడ్ జేఎన్-1 సబ్ వేరియంట్
  • భారత్ లో 197కి పెరిగిన జేఎన్-1 కేసులు
  • అత్యధికంగా కేరళలో 83 కేసులు
  • తెలంగాణలో రెండు జేఎన్-1 కేసుల నమోదు
చైనాలో తొలిసారిగా కొవిడ్ వైరస్ మహమ్మారి వెలుగు చూశాక ఇప్పటివరకు అనేక ఉత్పరివర్తనాలకు గురైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జేఎన్-1 సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. భారత్ లోనూ జేఎన్-1 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

గడచిన 24 గంటల్లో భారత్ 636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగింది. వీటిలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. దేశంలో కొత్తగా నాలుగు మరణాలు నమోదయ్యాయి.

ప్రస్తుతం భారత్ లో కొవిడ్ జేఎన్-1 యాక్టివ్ కేసుల సంఖ్య 197కి పెరిగింది. ఒక్క కేరళలోనే ఈ కేసులు 83 ఉన్నాయి. కాగా, తెలంగాణలో జేఎన్-1 కేసులు రెండు నమోదయ్యాయి. జేఎన్-1 సబ్ వేరియంట్ తో భయపడాల్సిన పనేమీ లేదని కేంద్రం చెబుతోంది.


More Telugu News