జపాన్ లో 5 గంటల వ్యవధిలో 50 సార్లు కంపించిన భూమి

  • జపాన్ లో భారీ భూకంపం
  • 3.4 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు
  • గరిష్ఠంగా 7.6 తీవ్రత నమోదు
  • రష్యా, ఉత్తర కొరియాలోనూ కంపించిన భూమి
జపాన్ లో ఇవాళ భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. 5 గంటల వ్యవధిలోనే 50 సార్లు భూమి కంపించడంతో జపాన్ ప్రజలు హడలిపోయారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. మొదట 3.4 తీవ్రతతో మొదలైన భూ ప్రకంపనలు గరిష్ఠంగా 7.6 తీవ్రతకు చేరుకున్నాయి. 

భూకంపం ప్రభావంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నిగాటా, టోయోమాలో పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. భారీ భూకంపం ధాటికి సముద్రపు అలలు పోటెత్తగా, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే జపాన్ పశ్చిమ తీరాన్ని సునామీ అలలు తాకాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. 

అటు, రష్యా, ఉత్తర కొరియా దేశాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రెండు దేశాల పరిధిలోనూ చాలా చోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News