నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి యాదాద్రి ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు

  • సెక్రటేరియెట్‌లో రేవంత్‌ని సన్మానించిన ఆలయ అర్చకుల బృందం
  • ‘ఎక్స్’ వేదికగా వీడియోను షేర్ చేసిన ‘తెలంగాణ కాంగ్రెస్’
  • కొత్త ఏడాది మొదటి రోజున బిజీబిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి
కొత్త సంవత్సరం 2024 తొలి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌ని కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఆయనను సన్మానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘తెలంగాణ కాంగ్రెస్’ ఎక్స్ వేదికగా పంచుకుంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజు సోమవారం బిజీబిజీగా గడిపారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సహచర మంత్రులు కొండా సురేఖ, సీతక్క (దనసరి అనసూయ) ఉన్నారు. నాంపల్లి గ్రౌండ్స్‌లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

ఏడాదంతా మంచి జరగాలని కాంక్షిస్తూ చాలామంది తమ ఇష్టదైవాలను ప్రార్థించడం సోమవారం అన్ని చోట్లా కనిపించింది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ఏడాది కావడంతో చాలామంది రాజకీయ నాయకులు ఇష్టదైవాలను దర్శించుకోవడం కనిపించింది.


More Telugu News