నుమాయిష్‌కు రావాలంటే మాస్క్ ధరించాల్సిందే... ఎంట్రీ ఫీజు... ఎగ్జిబిషన్ వేళలివే!
- ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్
- సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్
- వీకెండ్స్, సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్
దేశవ్యాప్తంగా... తెలంగాణవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ రోజు సాయంత్రం ప్రారంభమైన నుమాయిష్‌కు మాస్క్ తప్పకుండా ధరించి రావాలని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం నుమాయిష్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనుంది. అంటే 45 రోజుల పాటు ఇది ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు... ప్రాంతాలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. నుమాయిష్ కోసం 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక నుమాయిష్ ఎంట్రీ ఫీజు గతంలో మాదిరిగానే వుంది. గత ఏడాది రూ.10 పెంచి ధరను రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా ఈ ధరనే కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర వరకు, వీకెండ్స్, సెలవు దినాలలో రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరం సమయం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 9న లేడీస్ డే పేరుతో మహిళలకు, 31న చిల్ట్రన్ డే పేరుతో పిల్లలకు నుమాయిష్ సందర్శన ఉచితం.