మెస్సీ ధరించే 10వ నెంబర్ జెర్సీని మరెవరికీ కేటాయించకూడదని నిర్ణయం
- మారడోనాకు లభించని గౌరవం మెస్సీ సొంతం
- మెస్సీ రిటైర్మెంట్ తర్వాత ఆ జెర్సీని పక్కన పెట్టేస్తామని వెల్లడి
- కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ఆ నెంబర్ ను కేటాయించబోమని స్పష్టీకరణ
ప్రపంచ ఫుల్ బాల్ చరిత్రలో అర్జెంటీనా దిగ్గజాలు డిగో మారడోనా, లియోనెల్ మెస్సీ ఇద్దరూ ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే ఆటతీరుతో వారు సాకర్ ప్రపంచంపై తమదైన ముద్రను వేశారు. అయితే, మారడోనాకు లభించని గౌరవం మెస్సీకి లభించింది. మెస్సీ ధరించే 10వ నెంబర్ జెర్సీని మరెవరికీ కేటాయించకూడదని, ఆ జెర్సీకి శాశ్వతంగా ముగింపు పలకాలని అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
మెస్సీ జెర్సీని మరెవరికీ ఇవ్వకూడదని తీర్మానించినట్టు అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు క్లాడియో తపయా వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్ కు మెస్సీ వీడ్కోలు పలికిన తర్వాత అతని జెర్సీని పక్కన పెట్టేస్తామని చెప్పారు. కొత్తగా జట్టులోకి వచ్చే మరెవరికీ ఆ నెంబర్ జెర్సీని కేటాయించబోమని తెలిపారు. తమ దేశ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీకి తాము చేయగలిగిన చిన్న పని ఇదేనని చెప్పారు. మరోవైపు అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పట్ల మెస్సీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.