పెద్దమ్మగుడి, జగన్నాథ ఆలయాలకు భక్తుల తాకిడి... జూబ్లీహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
- జనవరి 1వ తేదీ కావడంతో ఆలయాలకు తరలివెళుతున్న భక్తులు
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్
- ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు పోలీసుల అవస్థలు
ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం జనవరి 1వ తేదీని సెలవుదినంగా ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌లో దేవాలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, జగన్నాథ ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం, చిలుకూరు బాలాజీ గుళ్లకు భక్తులు వరుస కడుతున్నారు.
దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పెద్దమ్మగుడి, జగన్నాథ ఆలయం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ఉండటంతో ఇక్కడ వాహనాలు కిలో మీటర్‌కు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు.