నేపాల్‌లో 4.3 తీవ్రతతో భూకంపం
- ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు
- ఖాట్మండుకు 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
- వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
నేపాల్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. రాజధాని ఖాట్మండుకు తూర్పున 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నూతన ఏడాది 2024 స్వాగత వేడుకలు జరుగుతున్న వేళ ఈ ప్రకృతి ప్రకోపం సంభవించింది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.