ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలిపేసిన టీఎస్ఆర్టీసీ!

  • మహాలక్ష్మి పథకం కారణంగా బస్సుల్లో రద్దీ
  • గుర్తింపు కార్డులు చూసి, వయసు నిర్ధారించుకోవడంలో ఆలస్యం
  • అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం
  • ఆ టికెట్ల జారీని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన సజ్జనార్
మహాలక్ష్మి పథకం కారణంగా సిటీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. రేపటి (జనవరి 1) నుంచి ఈ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 

ఈ టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్‌లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సుల్లో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు సజ్జనార్ తెలిపారు.


More Telugu News