126 చెట్లు అక్రమంగా కొట్టివేత.. బీజేపీ ఎంపీ సోదరుడి అరెస్ట్
- బెంగళూరులో ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహ అరెస్ట్
- హసన్ జిల్లాలో 126 చెట్లు అక్రమంగా కొట్టివేత కేసులో అటవీ శాఖ అదుపులో విక్రమ్ సింహ
- అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో విక్రమ సింహ పట్టుబడ్డ వైనం
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహను పోలీసులు బెంగళూరులో తాజాగా అరెస్టు చేశారు. హసన్ జిల్లాలో కోట్ల రూపాయల విలువైన 126 చెట్లను అక్రమంగా కొట్టేసి వివిధ ప్రాంతాలకు తరలించిన కేసులో విక్రమ్ సింహను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ అధికారుల కస్టడీలో ఉన్నారు.
ఈ కేసులో ఆధారాలు విక్రమ్ సింహాపై అనుమానాలు రేకెత్తించడంతో అటవీ శాఖ అధికారులు గత కొంతకాలంగా విక్రమ్ సింహ కోసం వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఆయన బెంగళూరులో ఉన్నట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు..ఆర్గనైజ్డ్ క్రైం టీం పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ సింహను హసన్ జిల్లాకు తీసుకెళ్లాక కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటారని సమాచారం.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనలో ఎంపీ ప్రతాప్ సింహ పేరు పతాకశీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే. ప్రతాప్ కార్యాలయం జారీ చేసిన విజిటర్ పాస్ సాయంతోనే దుండగుల్లో ఒకరు పార్లమెంటులోకి ప్రవేశించినట్టు బయటపడటంతో ప్రతిపక్షం ఎంపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. అయితే, నిందితుడి తండ్రి ప్రతాప్ సింహ నియోజకవర్గానికి చెందిన వాడని, అతడు ఎంపీ విజిటర్ పాస్ తీసుకున్నాడని బీజేపీ పార్లమెంటుకు తెలిపింది.