డిగ్రీ చదువుతో ఎటువంటి ఉపయోగం లేకపోయిందన్న బిగ్ బీ

  • కేబీసీ తాజా ఎపిసోడ్‌లో కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్న షో వ్యాఖ్యాత అమితాబ్
  • హాస్టల్‌ గోడ దూకి వెళ్లి సినిమాలు చూసి వచ్చేవాణ్ణని వెల్లడి
  • కాలేజీ రోజులన్నీ నిరుపయోగమైనట్టేనని వ్యాఖ్య
కౌన్ బనేగా కరోడ్‌పతీ తాజా ఎపిసోడ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో తాను చదివిన కిరోరీ మల్ కాలేజీలోనే షో కంటెస్టెంట్ కూడా చదవడంతో బిగ్ బీ నాటి జ్ఞాపకాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. 

‘‘అప్పట్లో నేను హాస్టల్‌లో ఉండి చదువుకునే వాణ్ణి. అది ఓ మూలన ఉండేది. గదిలోంచి చూస్తే ప్రహరీ గోడ కనిపించేది. సినిమాలు చూసేందుకు మేము గోడ దూకి వెళ్లేవాళ్లం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే..కాలేజీలో నేను చదివిన రోజులన్నీ నిరుపయోగమైనట్టే. అప్పట్లో నేనేమీ సాధించింది లేదు’’ అని ఆయన చెప్పారు. తన బీఎస్‌సీ డిగ్రీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అప్పట్లో తాను విఫలమైనట్టు ఫీలయ్యే వాణ్ణని బిగ్ బీ చెప్పుకొచ్చారు. అలహబాద్‌లోని బాయ్ హైస్కూల్లో తాను చదువుకున్నానని, 1962లో డిగ్రీ పూర్తి చేశానని బిగ్‌బీ తెలిపారు.


More Telugu News