జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ్నించి పోటీ చేయమంటే అక్కడ్నించి పోటీ చేస్తా: ఎంపీ వంగా గీత
- ఎంపీ వంగా గీత ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రచారం
- పిఠాపురం బరిలో దిగుతున్నట్టు కథనాలు
- జగన్ మాటే తమకు శిరోధార్యమన్న వంగా గీత
కాకినాడ ఎంపీ వంగా గీత ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వంగా గీతను మీడియా ప్రశ్నించింది. అలాంటి సమాచారం తనకేమీ లేదని, ప్రచారం అని మీరే అంటున్నారుగా అని ఆమె మీడియాకు బదులిచ్చారు.
అయితే, సీఎం జగన్ మాటే తమకు శిరోధార్యమని, ఆయన ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడ్నించి పోటీ చేస్తానని వంగా గీత స్పష్టం చేశారు. తాము ఎక్కడ్నించి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.
సంస్థాగతంగా ప్రతి పార్టీలోనూ గెలుపోటములపై కసరత్తులు జరుగుతాయని, ఎవరిని ఎక్కడ్నించి బరిలో దించాలనేది పరిశీలిస్తుంటారని వివరించారు. బీజేపీలో అయినా, టీడీపీలో అయినా, మా వైసీపీలో అయినా జరిగేది ఇదేనని తెలిపారు.
లోక్ సభలో తమ పార్టీకి నాయకుడుగా కొనసాగుతున్న మిథున్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారని, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారని, వీరు ఐదు జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారని... సీఎం జగన్ తో కూడిన పార్టీ అధినాయకత్వం వీరందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వంగా గీత వివరించారు.