మెగా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

  • విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
  • టీచర్ల పదోన్నతులు, బదిలీలలో ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచన
  • రాష్ట్రంలో బడిలేని గ్రామపంచాయతీ ఉండవద్దన్న సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఈ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీచర్ల పదోన్నతులు, బదిలీలలో ఇబ్బందులపై దృష్టి సారించాలన్నారు. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. మన రాష్ట్రంలో బడిలేని గ్రామపంచాయతీ ఉండవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకవేళ విద్యార్థులు లేరని ఏవైనా బడులు మూసివేస్తే కనుక మళ్లీ తెరవాలన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఓ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు.


More Telugu News