ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను!: రాజకీయాలపై నటుడు శివాజీ వ్యాఖ్యలు
- గతంలో ప్రత్యేక హోదాపై తన బాణీ వినిపించిన శివాజీ
- కొన్నాళ్లుగా మౌనం
- ఇటీవల బిగ్ బాస్ షోలో పాల్గొన్న వైనం
- ప్రస్తుత రాజకీయాలు కుల, మత ప్రాతిపదికన నడుస్తున్నాయని వెల్లడి
గతంలో ప్రత్యేక హోదా అంశంలో తన గళం వినిపించిన టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించారు. శివాజీ తాజాగా తన ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై స్పందించారు.
ప్రస్తుతం రాజకీయాలు కులం, మతం ప్రాతిపదికన నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు ప్రజాసమస్యలపై ఒంటరిపోరాటం చేశానని, ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలనని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని శివాజీ స్పష్టం చేశారు. తనకూ ఓ కుటుంబం ఉందని పేర్కొన్నారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఏపీ, తెలంగాణలో భారీ అభిమాన గణం ఉందని, వారు కోరుకుంటే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని శివాజీ అభిప్రాయపడ్డారు.