స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం!
- సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ మొత్తాన్ని అందించిన ముఖ్యమంత్రి
- ఈ నెల 23న గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
- డ్యూటీలో మృతి చెందిన డెలివరీ బాయ్ గురించి ప్రస్తావన
- వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్ కుటుంబానికి... సీఎం సహాయనిధి కింద ఈ మొత్తాన్ని అందించారు. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ బాయ్ కుటుంబానికి ఏమైనా చేస్తుందని భావించానని.. కానీ ఏమీ చేయలేదన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబం వివరాలు తెలుసుకున్న సీఎం ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు అతని కుటుంబానికి అందించారు.