విజయవాడలో ల్యాండ్ క్రూయిజర్లు దాచారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్
- 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచారన్న రేవంత్ రెడ్డి
- బుల్లెట్ ప్రూఫ్ కార్లను తాము విజయవాడలో దాచామని చెప్పడం సరికాదన్న కవిత
- సీఎం సెక్యూరిటీని పోలీసులు, ఇంటెలిజెన్స్ చూసుకుంటుందన్న కవిత
బీఆర్ఎస్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసి విజయవాడలో దాచుకుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. శనివారం ఆమె వరంగల్ జిల్లాలో మాట్లాడుతూ... గత పదేళ్లుగా తమకు ఇంత సెక్యూరిటీ కావాలని తాము ఎప్పుడూ కోరలేదన్నారు. ఇంటెలిజెన్స్ లేదా పోలీసులు మాత్రమే సెక్యూరిటీ అంశాలను చూసుకుంటారని చెప్పారు. సెక్యూరిటీకి సంబంధించి బడ్జెట్ ఉంటుందని, దానిని భద్రతా సిబ్బంది చూసుకుంటుందన్నారు. కానీ సెక్యూరిటీ అంశాన్ని పెద్దదిగా చేయడం సరికాదన్నారు. మేమేదో రహస్యంగా విజయవాడలో దాచుకున్నట్లు చెప్పడం ఏమిటి? అని ప్రశ్నించారు.
బుల్లెట్ ప్రూఫ్ కార్లను తాము ఏదో విజయవాడలో దాచుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం.. వారి గౌరవాన్నే తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి భద్రత.. ప్రోటోకాల్‌ను సెక్యూరిటీ వింగ్ చూసుకుంటుందన్నారు. ఇందులో రాజకీయాల నాయకుల జోక్యం ఉండదన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ అని, దీనిని జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆమె విజ్ఞప్తి చేశారు.