బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు

  • హెచ్‌సీఏలో రూ.20 కోట్ల నిధుల గోల్ మాల్ వ్యవహారంపై ఈడీ దర్యాఫ్తు
  • నిన్న విచారణకు హాజరు కావాల్సిన వినోద్‌.. గైర్హాజరు
  • హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంలో జనవరి మొదటి వారంలో హాజరు కావాలని నోటీసులు
బెల్లంపల్లి ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ చీఫ్ వినోద్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల వ్యవహారంలో జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. HCAలో రూ.20 కోట్ల నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై ఈడీ దర్యాఫ్తు చేస్తోంది. దర్యాఫ్తులో భాగంగా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అర్షబ్ ఆయూబ్, శివలాల్ యాదవ్‌ను నిన్న విచారించింది.

వినోద్ కూడా వారితో పాటు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణం సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిని ఈడీ దర్యాఫ్తు చేస్తోంది.


More Telugu News