సీఎం రేవంత్ రెడ్డితో నాగార్జున దంపతులు.. వీడియో ఇదిగో!

  • శనివారం సీఎంను కలిసిన నాగ్, అమల
  • పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ప్రముఖ నటుడు నాగార్జున శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఉదయం తన భార్య అమలతో కలిసి జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.


More Telugu News