అయోధ్య ధామ్ స్టేషన్ ను ప్రారంభించిన మోదీ.. వీడియో ఇదిగో!
- 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా
- మరికాసేపట్లో ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం
- అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ.15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం. అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో కలిసి అయోధ్య ధామ్ స్టేషన్ ను మోదీ ప్రారంభించారు. ఆపై అక్కడి నుంచి అయోధ్య ఎయిర్ పోర్ట్ లో కొత్తగా నిర్మించిన టెర్మినల్ ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.