రామోజీరావును కలిసి ఆశీస్సులు అందుకున్న సీనియర్ నటుడు నరేశ్
- నరేశ్ సినీరంగంలోకి వచ్చి 50 ఏళ్లు
- రామోజీరావును మర్యాదపూర్వకంగా కలిసిన నరేశ్
- నరేశ్ చిత్రం 'శ్రీవారికి ప్రేమలేఖ'తో ప్రారంభమైన ఉషాకిరణ్ మూవీస్
- ఈ విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించిన నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. ఈ విషయాన్ని నరేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"నా మార్గదర్శి, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త, లెజెండరీ రామోజీరావు గారిని కలిశాను. దాదాపు 30 నిమిషాల పాటు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆశీస్సులు అందుకున్నాను. 1984లో వచ్చిన నా సూపర్ హిట్ చిత్రం 'శ్రీవారికి ప్రేమలేఖ' ద్వారానే ఈనాడు గ్రూపు చిత్ర నిర్మాణ విభాగం (ఉషాకిరణ్ మూవీస్) ప్రారంభమైంది. అప్పటినుంచి వారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది" అంటూ నరేశ్ ట్వీట్ చేశారు.
అంతేకాదు, రామోజీరావును కలిసినప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.