కేబీసీలో రేవంత్ రెడ్డిపై అమితాబ్ ప్రశ్న!
- ఈ నెల 15వ తేదీన ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్లో రూ.40వేల ప్రశ్న
- రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారంటూ అమితాబ్ ప్రశ్న
- సమాధానం కోసం లైఫ్ లైన్ తీసుకున్న పార్టిసిపెంట్
- ఎక్కువ మంది ప్రేక్షకులు తెలంగాణ అని సూచించిన వైనం
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ ప్రశ్న వచ్చింది. అయితే ఈ ప్రశ్నకు పార్టిసిపెంట్ సమాధానం చెప్పలేకపోయారు. ఈ నెల 15వ తేదీన ప్రసారమైన KBC ఎపిసోడ్లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్ను బిగ్ బీ ప్రశ్నించారు. ఆప్షన్లుగా... ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్ ఇచ్చారు.
కానీ పార్టిసిపెంట్‌గా ఉన్న యువతి ఆలోచించినప్పటికీ జవాబు ఆమెకు తట్టలేదు. దీంతో ఆమె లైఫ్ లైన్ తీసుకుంది. ఈ సమయంలో ప్రేక్షకులలో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. దీంతో సదరు యువతి తెలంగాణ అని సమాధానం చెప్పడంతో తదిపరి ప్రశ్నకు అర్హత సాధించారు.