ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలియాలి: మంత్రి శ్రీధర్ బాబు

  • తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదన్న మంత్రి శ్రీధర్ బాబు
  • మా వద్ద మూడు బ్యారేజీలు ఉన్నా ప్రయోజనం లేదని వ్యాఖ్య
  • మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోతే; అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో బుడగలు వచ్చాయని వెల్లడి
తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అసలు తమ వద్ద మూడు బ్యారేజీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని... తాగు, సాగునీటికి ఇబ్బంది అవుతోందన్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం... అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో బుడగలు రావడం తెలిసిందేనని... ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉందన్నారు.


More Telugu News