ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో తగవులాడుతున్నామని ప్రచారం చేస్తున్నారు: సీపీఐ నారాయణ

  • సింగరేణి ఎన్నికల తర్వాత కాంగ్రెస్, సీపీఐ మధ్య విభేదాలు వచ్చాయనేది అవాస్తవమన్న నారాయణ
  • కార్మిక సంఘం ఎన్నికలకు.. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • బీఆర్ఎస్ ఉన్నప్పుడే దుష్టసంప్రదాయానికి తెరలేపిందని విమర్శ
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు... రాజకీయాలకు సంబంధం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య విభేదాలు వచ్చాయని... తగవులాడుకుంటున్నారని ప్రచారం సాగుతోందని ఇందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ విడిపోతాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కార్మిక సంఘం ఎన్నికలకు... రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని గుర్తుంచుకోవాలని సూచించారు.

గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దుష్టసంప్రదాయానికి తెరలేపిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కార్మికులను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించామని నారాయణ వ్యాఖ్యానించారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కాగా ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.


More Telugu News