రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క
- 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ వ్యాఖ్యలు
- బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ
- మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష)
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే... ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈనెల 24న 'వ్యూహం' సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్క గురించి వర్మ చెబుతూ.. 'బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు' అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.