ఉద్యోగార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

  • నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ఉద్యోగార్థులను విదేశాల్లో ప్రమాదకర ఉద్యోగాల్లో దించుతున్నాయన్న విదేశాంగ శాఖ
  • ఫేక్ ఏజెన్సీలు వాట్సాప్‌, మెసేజీల ద్వారా ఉద్యోగార్థులకు వల పన్నుతున్నాయని వెల్లడి
  • ఈ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల బారిన పడొద్దంటూ విదేశాంగ శాఖ ఉద్యోగార్థులను తాజాగా హెచ్చరించింది. ఫేక్ సంస్థల నకిలీ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోని అనేక సంస్థలు విదేశీ ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి నుంచీ రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని తెలిపింది. వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా కాల్స్, మెసేజీలతో బాధితులను ట్రాప్ చేసే ఏజెన్సీలను పట్టుకోవడం కష్టంగా మారిందని కూడా పేర్కొంది. 

ఈ ఫేక్ ఏజెన్సీలు ఉద్యోగార్థులను విదేశాలకు తరలించి ప్రమాదకర వృత్తుల్లోకి దించుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. తూర్పు ఐరోపా దేశాలు, గల్ఫ్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ దేశాలు, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్ తదితర దేశాల్లో నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల మోసాలు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. ఇమిగ్రేష‌న్ యాక్ట్ -1983 ప్రకారం ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యే సంస్థలు తమ సేవలకు గాను రూ.30 వేల ఫీజును, 18 శాతం జీఎస్టీతో తీసుకుంటాయని వివరించింది. నకిలీ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.


More Telugu News