రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ సీఎం నాకు ఇస్తున్నారు: వైసీపీ ఎంపీ భరత్

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన మార్గాని భరత్
  • గెలుపు కోసమే ఇన్చార్జిల మార్పు అని భరత్ వెల్లడి
  • సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ అవకాశాలు ఇస్తారని వివరణ
  • ఈసారి రాజమండ్రి ఎంపీ స్థానం బీసీ వర్గానికి ఇస్తున్నారని వ్యాఖ్యలు
ఈసారి ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీలో టికెట్ల అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన అనంతరం రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మొత్తం 175 సీట్లలో గెలిచేందుకు కృషి చేయాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. గెలుపు కోసమే ఇన్చార్జిల మార్పులు అని స్పష్టం చేశారు. సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ అవకాశాలు ఇస్తారని వివరించారు. 

ఇక, ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారు... రాజమండ్రి ఎంపీ సీటు ఈసారి కూడా బీసీ అభ్యర్థికే ఇస్తున్నారు అని వివరించారు.


More Telugu News