పార్టీ ఆదేశించినా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను: మధుయాష్కీ

  • 15 లోక్ సభ స్థానాల్లో గెలుపే కాంగ్రెస్ లక్ష్యమని వ్యాఖ్య
  • పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడు కొనసాగుతాడని స్పష్టీకరణ
  • బీజేపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినా తాను పోటీ చేయనని మధుయాష్కీ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 15 లోక్ సభ స్థానాలు అని చెప్పారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని వెల్లడించారు.

పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారని.. అందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారన్నారు. తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అని ఓ వైపు బీజేపీ.. మరోవైపు బీఆర్ఎస్ చెబుతున్నాయన్నారు. మజ్లిస్ పార్టీ మద్దతు లేకుంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలవరని విమర్శించారు.


More Telugu News