హైదరాబాద్ లో 'గేమ్ ఛేంజర్' షూటింగ్!
- శంకర్ నుంచి 'గేమ్ ఛేంజెర్'
- చరణ్ జోడీగా కియారా అద్వాని
- హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం
- ప్రత్యేక ఆకర్షణగా భారీతారాగణం
చరణ్ - శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన కెరియర్లో అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే. అలాంటి ఈ సినిమా .. షెడ్యూల్స్ పరంగా కాస్త ఎక్కువ గ్యాప్ నే తీసుకుంటోంది. ఇటీవల 'ఇండియన్ 2' సినిమాతో శంకర్ బిజీగా ఉండటమే అందుకు కారణం.
అలాంటి ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఈ రోజునే ఈ షెడ్యూల్ షూటింగు మొదలైంది. ప్రస్తుతం శ్రీకాంత్ .. సముద్రఖని .. ఎస్. జె. సూర్య కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. త్వరలో చరణ్ కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు.
చరణ్ జోడీగా ఈ సినిమాలో కియారా అద్వాని అలరించనుంది. చరణ్ తో ఆమెకి ఇది రెండో సినిమా. ఇతర ముఖ్యమైన పాత్రలలో సునీల్ ... అంజలి .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. యాక్షన్ సీన్స్ .. సాంగ్స్ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది.