చివరి చూపుకు నోచుకోలేకపోతున్నా: విశాల్ కంటతడి
- విజయకాంత్ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
- తాను కలిసిన గొప్ప వ్యక్తుల్లో విజయకాంత్ ఒకరన్న విశాల్
- సమాజ సేవను ఆయన నుంచే నేర్చుకున్నానని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి అర్పించారు.
మరోవైపు, యువహీరో విశాల్ స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ మనల్ని విడిచిపెట్టి మనకు శూన్యాన్ని మిగిల్చారని అన్నారు. విజయకాంత్ మరణవార్త విన్నాక తన కాళ్లు, చేతులు పని చేయడం లేదని చెప్పారు. కెప్టెన్ ను కోల్పోవడం బాధగా ఉందని అన్నారు. ఆయన చివరి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. తాను కలిసిన అతిగొప్ప వ్యక్తులో విజయకాంత్ అన్న ఒకరని చెప్పారు. సమాజసేవను ఆయనను నుంచే తాను నేర్చుకున్నానని... ఆయన పేరుపై సమాజ సేవను కొనసాగిస్తానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.