ఈసారి నాకు టికెట్ వస్తుందో, రాదో అన్నదానిపై సమాచారం లేదు: గోరంట్ల మాధవ్
- ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం
- నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతున్న అధికారపక్షం
- ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరంలేదన్న గోరంట్ల మాధవ్
- తాను జగనన్న సైనికుడినని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎవరిని కదిలించినా టికెట్ కు సంబంధించిన అంశాలే చర్చకు వస్తున్నాయి. ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వైసీపీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేస్తోంది. దాంతో, ఎవరికీ టికెట్ పై గ్యారెంటీ లేకుండా పోయింది! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈసారి తనకు టికెట్ ఉందని గానీ, లేదని గానీ ఇతరత్రా స్పష్టమైన సమాచారం ఏమీ లేదని అన్నారు. అయితే, తనకు ఈసారి అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను జగనన్న సైనికుడిగానే ఉంటానని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.
ప్రతి చిన్న కులానికి కూడా గుర్తింపునివ్వాలని ఆలోచించి సీఎం జగన్ టికెట్లపై నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, దానికి తామంతా కట్టుబడి ఉంటామని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కులానికి ఎక్కడ టికెట్ ఇచ్చినా, కులం అంతా ఒక్కతాటిపై నిలబడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తుందని చెప్పారు.