దరఖాస్తులు జిరాక్స్ తీసుకోమంటున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం
- దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారన్న రాజాసింగ్
- ఒక్కో దరఖాస్తు ఫామ్‌కు డబ్బులు అడుగుతున్నారని ఆరోపణ
- గోషామహల్, మంగళ్‌హాట్ డివిజన్లలో పర్యటించిన రాజాసింగ్
ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు కోసం ఫామ్స్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో భాగంగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ క్రమంలో తన నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిరాక్స్ తీసుకోవాలని... లేదంటే ఒక్కో దరఖాస్తు ఫామ్‌కు డబ్బులు చెల్లించాలని ప్రజలను డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.