జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్.. కొలువుదీరనున్న 2,400 స్టాళ్లు

  • ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగింపు
  • టికెట్ ధర రూ. 40
  • 22 లక్షల మంది సందర్శిస్తారని అంచనా
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్)ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. 

ఎగ్జిబిషన్‌ను మొత్తంగా 22 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీభవన్, గోషామహల్, అజంతా వైపు గేట్లు ఏర్పాటు చేశారు. టికెట్ ధరను రూ.40గా నిర్ణయించారు. సందర్శకులకు వినోదాన్ని పంచేందుకు క్రీడాపోటీలతోపాటు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.


More Telugu News