వరల్డ్ కప్ ఫైనల్స్ ఓటమిపై తొలిసారిగా స్పందించిన షమీ
- వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకుండా ఉన్నామన్న షమీ
- రెండు నెలల కష్టమంతా ఒక్క మ్యాచ్‌తో తుడిచిపెట్టుకుపోయిందని వ్యాఖ్య
- నిరాశలో ఉన్న తమను మోదీ పలకరింపు సర్‌ప్రైజ్ చేసిందని వెల్లడి
ఇటీవలి వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓటమి టీమిండియా క్రీడాకారులను ఇంకా వెంటాడుతోంది. మీడియా ముందు ఒక్కొక్కరుగా తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా మహ్మద్ షమీ కూడా ఫైనల్స్‌పై స్పందించాడు. ఆ రోజు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేకుండా ఉన్నామని వ్యాఖ్యానించాడు.
‘‘ఆ రోజు యావత్ దేశం నిరాశలో కూరుకుపోయింది. విజయయాత్రను కొనసాగించాలని మేము వంద శాతం ప్రయత్నించాం. అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్ప లేకుండా ఉన్నాం’’ అని అన్నాడు.
ఓటమి భారంతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న తమను ప్రధాని మోదీ కలుసుకోవడం ఓ సర్‌ప్రైజ్ అని మహ్మద్ షమీ వ్యాఖ్యానించాడు. ‘‘ఓటమి తరువాత మా గుండెలు పగిలాయి. నిరాశతో మేమంతా డ్రెస్సింగ్ రూంలో కూలబడిపోయాం. రెండు నెలల కష్టమంతా ఒక్క మ్యాచ్‌తో తుడిచిపెట్టుకుపోయింది. అది మాకు దుర్దినం. కానీ ప్రధాని వచ్చినప్పుడు తలెత్తుకుని నిలబడాలి. ప్రధాని వస్తున్నట్టు మాకు ఎవరూ చెప్పలేదు. సడెన్‌గా వచ్చారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థితిలో కూడా లేని సమయంలో ప్రధాని రాక మాకు సర్‌ప్రైజ్ ఇచ్చింది’’ అని షమీ తెలిపాడు.