తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ను తయారు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని.. సవాళ్లు.. లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలను చెబుతామన్న రేవంత్ రెడ్డి
  • ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలని సూచన
  • కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలు మనకు అవసరం లేదన్న సీఎం  
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని.. సవాళ్లు.. లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలను చెబుతామని... తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలని అధికారులకు సూచించారు. ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలన్నారు.

హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలని.. ప్రజలకు అర్థమయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రానికి పేరు వస్తుందనే భేషజాలు మనకు అవసరం లేదన్నారు. కొత్త వాహనాలు అవసరం లేదని... ఉన్న వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు.


More Telugu News