నేను ఎలాంటి తప్పు చేయలేదు: ఐపీఎస్ నవీన్ కుమార్

  • భన్వర్ లాల్ కుటుంబాన్ని మోసం చేసినట్లుగా నవీన్ కుమార్‌పై ఆరోపణలు
  • కేసు కోర్టు పరిధిలో ఉందన్న నవీన్ కుమార్
  • రేపు అన్ని వివరాలు వెల్లడిస్తానన్న నవీన్ కుమార్
రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ కుటుంబాన్ని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ నవీన్ కుమార్ బుధవారం స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. సివిల్ మ్యాటర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు తనను వివరాల కోసం పోలీసులు పిలిచారని... తన వద్ద ఉన్న సమాచారాన్ని అంతటినీ వారికి ఇచ్చానని వెల్లడించారు. మూడేళ్లుగా అంటే 2020 నుంచి ఈ వివాదం నడుస్తున్నట్లు చెప్పారు. రేపు అన్ని వివరాలను వెల్లడిస్తామని.. న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు.


More Telugu News