జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
- విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
- డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తులు
- మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు
జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 2024 జనవరి 24 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
పీజీ ఎంట్రన్స్ మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది.
వివరాలు ఇవిగో...
పీజీ ఎంట్రన్స్ మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఓ ప్రకటనలో వెల్లడించింది.
- డిసెంబరు 26 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జనవరి 27 నుంచి 29 వరకు దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం
- మార్చి 7 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్
- మార్చి 11 నుంచి 28 వరకు పరీక్షలు
- గతేడాదితో పోల్చితే ఈసారి సీయూఈటీలో మార్పులు
- మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- గతేడాది ఎంట్రన్స్ టెస్టుకు రెండు గంటల సమయం... ఈసారి ఆ సమయం 1.45 గంటలకు కుదింపు
- అదే సమయంలో... ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గించిన ఎన్టీయే. గతేడాది 100 ప్రశ్నలతో పరీక్ష... ఈసారి 75 ప్రశ్నలతో పరీక్ష
- ఈసారి పరీక్ష ఫీజు పెంపు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.1200, ఓబీసీ/ఎన్ సీఎల్/జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు రూ.1000, దివ్యాంగులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/హిజ్రాలకు రూ.900 పరీక్ష ఫీజుగా నిర్దేశించారు.