మీకేమైనా ఇబ్బందా...?: ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారన్న వార్తలపై మంత్రి రోజా స్పందన

  • ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారంటూ ప్రచారం
  • తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న రోజా
  • ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని వెల్లడి
ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తున్నారని, ఆమె రేపో ఎల్లుండో కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆమెకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవి అప్పగించబోతున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. 

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని ఓ మీడియా ప్రతినిధి రోజాను ప్రశ్నించగా, మీకేమైనా ఇబ్బందా? అంటూ రోజా తిరిగి ప్రశ్నించారు. తనకైతే ఏ ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అంశాల గురించి అనేక సందర్భాల్లో చెప్పానని గుర్తుచేశారు. 

"ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో ప్రకటించుకోవచ్చు. ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగులు పెట్టుకోవచ్చు. కానీ, వాళ్ల అజెండా నమ్మశక్యంగా ఉన్నప్పుడే ప్రజలు వారికి మద్దతుగా నిలుస్తారు. కాబట్టి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని భయపడే క్యారెక్టర్ జగన్ గారిది కాదు... ఆ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది" అంటూ రోజా వ్యాఖ్యానించారు.


More Telugu News