డబ్ల్యూటీసీలో రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ
- దక్షిణాఫ్రికాతో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసిన కోహ్లీ
- డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు
- 57 ఇన్నింగ్స్ ల్లో 2,101 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ
- 42 ఇన్నింగ్స్ ల్లో 2,097 పరుగులు చేసిన రోహిత్ శర్మ
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరో ఘనత అందుకున్నాడు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు.
2019-25 డబ్ల్యూటీసీ సైకిల్ లో రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్ ల్లో 2,097 పరుగులు చేయగా... కోహ్లీ 57 ఇన్నింగ్స్ ల్లో 2,101 పరుగులు సాధించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు.
ఈ జాబితాలో ఛటేశ్వర్ పుజారా (1,769), అజింక్యా రహానే (1,589), రిషబ్ పంత్ (1,575) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.