కేఎల్ రాహుల్ సెంచరీ... తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 ఆలౌట్
- సెంచురియన్ లో తొలి టెస్టు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- నేడు ఆటకు రెండో రోజు
- ఓవర్ నైట్ స్కోరుకు 37 పరుగులు జోడించిన టీమిండియా
- 101 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్
సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేయడం టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన రాహుల్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఇవాళ 208-8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5, నాండ్రే బర్గర్ 3, మార్కో యన్సెన్ 1, గెరాల్డ్ కోట్జీ 1 వికెట్ తీశారు.
అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. సిరాజ్ ధాటికి సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ 5 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 41 పరుగులు. ఓపెనర్ డీన్ ఎల్గార్ 21, టోనీ డి జోర్జి 12 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.