నా సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ హెచ్చరిక: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- రాజకీయ ప్రత్యర్థులకు పెద్దారెడ్డి వార్నింగ్
- 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారని వ్యాఖ్యలు
- రాజకీయాల్లో ఉన్న చీడపురుగులను ఏరివేస్తానని వెల్లడి
తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలు ఆగండి... ఆ తర్వాత నా అసలు రూపం చూపిస్తా... 2024 ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారు అని ఘాటు హెచ్చరికలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, తన ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
పంటకు ప్రమాదకరంగా మారే చీడపురుగులను ఎలా ఏరివేస్తామో, రాజకీయాల్లో ఉన్న చీడపురుగులను కూడా అలాగే ఏరివేస్తానని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. నా సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ హెచ్చరిక అని వెల్లడించారు. తాడిపత్రిలో జేసీ కుటుంబానికి, పెద్దారెడ్డికి మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.