అమెజాన్ ప్రైమ్ లో భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ .. 'ఫీనిక్స్'
- మలయాళం నుంచి మరో హారర్ థ్రిల్లర్
- నవంబర్ 17న థియేటర్స్ కి వచ్చిన సినిమా
- రీసెంటుగా ఓటీటీలో అందుబాటులోకి
- భయపెడుతూ సాగే కథాకథనాలు
మలయాళం సినిమాలు చాలావరకూ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అందువలన ఆడియన్స్ చాలా ఫాస్టుగా కనెక్ట్ అవుతుంటారు. మలయాళం సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. అలా ఈ నెల 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ కి 'ఫీనిక్స్' అనే సినిమా వచ్చింది. రినిష్ నిర్మించిన ఈ సినిమాకి విష్ణు భరతన్ దర్శకత్వం వహించాడు. అజూ వర్గీస్ ... నీల్జా కె బేబీ .. చందూనాథ్ .. అనూప్ మీనన్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.
నవంబర్ 17న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా మలయాళం వెర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే .. అడ్వకేట్ గా పనిచేసే జాన్ విలియమ్స్ .. భార్య .. ముగ్గురు పిల్లలతో కలిసి కొత్తగా ఒక బంగ్లాలోకి దిగుతాడు. అది బీచ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ ఇంట్లో దిగిన దగ్గర నుంచి 'ఫ్రెడ్డీ' అనే వ్యక్తి కోసం రోజుకి ఒక లెటర్ వస్తుంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అదే పనిగా ఒక పిట్ట వచ్చి కూస్తూ ఉంటుంది.
పోస్ట్ మేన్ తమ ఇంటి వైపుకే రావడం లేదు .. అలాంటప్పుడు లెటర్స్ ఎలా వస్తున్నాయి? అనే అనుమానం కలగడంతో, జాన్ విలియమ్స్ ఆ లెటర్స్ చదువుతాడు. తనకి తెలియని కథ ఏదో ఆ ఇంటికి ఉందనే విషయం అతనికి అర్థమవుతుంది. దాంతో అతను ఆ ఇంటి గురించి .. ఫ్రెడ్డీ గురించి ఆ ఊళ్లో వారిని వాకబు చేయడం మొదలుపెడతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ. ఈ సినిమా హైలైట్స్ లో ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. లొకేషన్స్ కనిపిస్తాయి.