టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టు... వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యం
- సెంచురియన్ లో తొలి టెస్టు
- వర్షం కారణంగా చిత్తడిగా మైదానం
- తొలి రోజు ఆటలో 8 వికెట్లకు 208 పరుగులు చేసిన టీమిండియా
టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యం కానుంది.
నిన్న కూడా వర్షం కారణంగా ఆట 59 ఓవర్లే జరిగింది. చివరి సెషన్ లో వర్షం పడడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆట ముగిసింది. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 70 పరుగులతోనూ, మహ్మద్ సిరాజ్ పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.
తొలి రోజు ఆటలో సఫారీ బౌలర్లదే పైచేయిగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను దక్షిణాఫ్రికా పేసర్లు హడలెత్తించారు. సీనియర్ బౌలర్ కగిసో రబాడా 5 వికెట్లతో సత్తా చాటగా, కొత్త బౌలర్ నాండ్రే బర్గర్ 2 వికెట్లు తీశాడు. ఎడమచేతివాటం పేసర్ మార్కో యన్సెన్ 1 వికెట్ తీశాడు.
టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (17), శుభ్ మాన్ గిల్ (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.