రేపు బెంగళూరుకు చంద్రబాబు.. కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే!

రేపు బెంగళూరుకు చంద్రబాబు.. కన్నడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే!
  • అరెస్టు సమయంలో అండగా నిలిచిన కన్నడ ప్రజలు
  • గురువారం ఉదయం 10 గంటలకు అభిమానులతో సమావేశం
  • బాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణుల సన్నాహాలు
ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రేపు (గురువారం) బెంగళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులతో ఆయన సమావేశం అవుతారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బెంగళూరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు సంతమారనహళ్లిలోని వైట్‌ఫీల్డ్-హొసకోటె రోడ్డులో ఉన్న కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ ఆహ్వానించింది.


More Telugu News